ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి చంద్రబాబు పిలుపు

మహానాడు వేదిక ఫై చంద్రబాబు నాయుడు వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం అన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టి ప్రజలకు ఉరితాళ్లు వేస్తున్నారని, వైసీపీ పాలనలో ప్రజలకు మోసం జరుగుతోందన్నారు. అవినీతి పాలనలో రాష్ట్రం దివాళ తిస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం పడిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్ పనులను మరిచారని మండిపడ్డారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం వైసీపీ ప్రభుత్వానికి చేతకాదని విమర్శించారు. టీడీపీ నేతల అక్రమ అరెస్టులతో తాను నిద్రలేని రాత్రులను గడిపానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని, విరోధులుగా గుర్తిస్తున్నారని తెలిపారు. టీడీపీ ఎవరికీ భయపడదని, ఎంత ఇబ్బంది పెట్టినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామన్నారు.