indira nui
అంతర్జాతీయం ముఖ్యాంశాలు

ఫోర్బ్స్‌ అమెరికా సంపన్న వ్యాపార వేత్తల్లో స్థానం దక్కించుకున్న భారతీయ మహిళలు వీరే

అమెరికాలో తొలి వంద మంది స్వయం కృషితో ఎదిగిన మహిళా వ్యాపార వేత్తల జాబితాను ఫోర్బ్స్ 2023 విడుదల చేసింది. అందులో నలుగురు భారతీయ సంతతి మహిళలు చోటు దక్కించుకున్నారు. జయశ్రీ ఉల్లాల్, ఇందిరా నూయి, నేహా నార్ఖేడే, నీర్జా సేథీలు.. ఈ నలుగురి వ్యాపారవేత్తల

అమెరికాలో తొలి వంద మంది స్వయం కృషితో ఎదిగిన మహిళా వ్యాపార వేత్తల జాబితాను ఫోర్బ్స్ 2023 విడుదల చేసింది. అందులో నలుగురు భారతీయ సంతతి మహిళలు చోటు దక్కించుకున్నారు. జయశ్రీ ఉల్లాల్, ఇందిరా నూయి, నేహా నార్ఖేడే, నీర్జా సేథీలు ఈ నలుగురి వ్యాపారవేత్తల సామూహిక నికర ఆస్తుల విలువ దాదాపు 4.06 బిలియన్ డాలర్లు. వీరి ఆస్తులు గతేడాది కంటే దాదాపు 12 శాతం పెరిగింది.

జయశ్రీ ఉల్లాల్ (62): పోర్బ్స్‌ జాబితాలో జయశ్రీ ఉల్లాల్ 4.4 బిలియన్‌ డాలర్ల నికర ఆస్తులతో 15వ స్థానంలో నిలిచారు. భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్తలలో ఈ ర్యాంకింగ్ అత్యున్నతమైనది. ప్రముఖ నెట్‌వర్కింగ్‌ కంప్యూటర్ నెట్‌వర్కింగ్ సంస్థ అయిన అరిస్టా నెట్‌వర్క్స్ సీఈవో, ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ సంస్థలో జయశ్రీ ఉల్లాల్ 2.4 శాతం వాటా కలిగి ఉన్నారు

నీర్జా సేథి (68): నీర్జా సేథి 990 మిలియన్‌ డాలర్ల నికర ఆస్తులతో పోర్బ్స్‌ జాబితాలో 25వ స్థానంలో నిలిచారు. 1980లో సేథి, ఆమె భర్త భరత్ దేశాయ్ ఐటీ కన్సల్టింగ్, ఔట్‌సోర్సింగ్ సంస్థ సింటెల్‌ను కేవలం 2 వేల డాలర్లతో స్థాపించారు.

నేహా నార్ఖేడే (38): క్లౌడ్ కంపెనీ కాన్‌ఫ్లూయెంట్ సహ వ్యవస్థాపకురాలు, మాజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అయిన నేహా నార్ఖేడ్ 520 మిలియన్ల డాలర్ల నికర ఆస్తులతో 50వ స్థానంలో ఉన్నారు. 2014లో ఇద్దరు లింక్డ్‌ఇన్ సహోద్యోగులతో కలిసి కాన్‌ఫ్లూయెంట్‌ను స్థాపించారు. పోర్బ్స్‌ ప్రకారం 2022 నాటికి ఈ కంపెనీ ఆదాయం దాదాపు 586 మిలియన్‌ డాలర్లు. ఈ కంపెనీలో నార్ఖేడే 6 శాతం వాటా కలిగి ఉన్నారు.

ఇందిరా నూయి (67): పెప్సికో మాజీ చైర్‌పర్సన్, సీఈవో అయిన ఇందిరా నూయి 350 మిలియన్‌ డాలర్ల నికర ఆస్తులతో ఫోర్బ్స్ 2023 జాబితాలో 77వ స్థానం దక్కించుకున్నారు. దాదాపు 24 ఏళ్ల పాటు పెప్సికో కంపెనీతో అనుబంధం ఉన్న ఇందిరా నూయి 2019లో పదవీ విరమణ పొందిన తర్వాత అమెజాన్‌ బోర్డు సభ్యురాలిగా కొనసాగుతున్నారు.