Uncategorized

జగన్ ‘సంపూర్ణ మద్య నిషేధం ‘ హామీ ఫై పవన్ కళ్యాణ్ సెటైర్లు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో సంపూర్ణ మద్య నిషేధం హామీ ఒకటి. రాష్ట్రం లో సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పిన జగన్..ఆ హామీని మాత్రం అమలుచేయలేకపోయాడు. దీనిపట్ల ప్రతిపక్షపార్టీలు విమర్శస్తునే ఉన్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్య నిషేధం ఫై విమర్శలు చేసారు.సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తామన్నట్లు పరిస్థితి తయారైందని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో సారా బట్టీలు, బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివేనని.. చిన్న గమనిక అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. వీటి ద్వారా వచ్చే అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికే అని ఆరోపించారు. అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు.. సత్యవర్తనులు ఆయనకిష్టులు అంటూ బైబిల్ సూక్తిని ట్వీట్‌లో జోడించారు.అంతకు ముందు జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా మద్యపాన నిషేధంపై ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సంపూర్ణ మద్యపాన నిషేధం అనగా మద్యం ఆదాయం రూ.9 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్లకు పెంచుట !! ఆ రాబడి చూపించి రూ.8 వేల కోట్ల బాండ్లు బజార్లో అమ్ముట ! ఇదీ ‘స్పిరిటెడ్ విజనరీ’’ అంటూ ట్వీట్ చేశారు.