జాతీయం తెలంగాణ ముఖ్యాంశాలు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం ప‌ట్టివేత‌

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది. రూ.53.77ల‌క్ష‌ల విలువైన బంగారాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి ఓ ప్ర‌యాణికుడి నుంచి 1022 గ్రాముల బంగారాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్నీ క్యాప్స్‌లో బంగారాన్ని దాచి త‌ర‌లిస్తున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. స‌ద‌రు ప్ర‌యాణికుడిని క‌స్ట‌మ్స్ అధికారులు.. శంషాబాద్ పోలీసుల‌కు అప్ప‌గించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.