నేడు సీఎం కెసిఆర్ , గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఒకే వేదికపైకి రాబోతున్నారు. గవర్నర్ వైఖరితో తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు చెబుతున్న కేసీఆర్ గత కొంతకాలంగా రాజ్‌భవన్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నేడు వీరిద్దరూ ఒకే వేదికపైకి రానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలంగాణ హైకోర్టు ఐదో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఉదయం 10.05 గంటలకు గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా హాజరవుతారని తెలుస్తోంది. కేసీఆర్ గతేడాది అక్టోబరు 11న చివరిసారి అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. మళ్లీ ఇన్ని నెలలకు ఇప్పుడు హాజరు కాబోతున్నారు.