జాతీయం ముఖ్యాంశాలు

దేశంలో కొత్తగా 17,070 కరోనా కేసులు

యాక్టివ్​ కేసులు.. 1,07,189

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో 17,070 మందికి వైరస్ సోకినట్టు తేలింది. దాంతో, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1 లక్ష 7 వేల 189కి చేరుకుంది. క్రియాశీల రేటు 0.25గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.40 శాతంగా ఉంది.

అయితే, మొన్నటి పోలిస్తే కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. మొన్న 18,819 కేసులు రాగా.. తాజాగా 1500 కు పైగా కేసులు తగ్గాయి. మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గింది. మొన్న 39 మంది మరణించగా… గడచిన 24 గంటల్లో 23 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దాంతో, దేశంలో కరోనా మరణాల సంఖ్య 5 లక్షల 25 వేల 139కు చేరుకుంది. మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది.

గడచిన 24 గంటల్లో 14 వేల 413 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో, వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4 కోట్ల 28 లక్షల 36 వేల 906కి చేరుకుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 197 కోట్ల 74 లక్షల పైచిలుకు వ్యాక్సిన్లు అందజేశారు. నిన్న ఒక్క రోజే 11 లక్షల 67 వేల 503 డోసులు ఇచ్చారు.