దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 19 వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 18 వేలకు తగ్గాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 18,166 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,39,53,475కు చేరాయి. ఇందులో 2,30,971 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 3,32,71,915 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డాయి. మరో 4,50,589 మంది మృతిచెందారు.
కాగా, కొత్తగా 23,624 మంది కరోనా నుంచి కోలుకోగా, 214 మంది మరణించారు. ఇప్పటివరకు 94,70,10,175 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.