తెలంగాణ ముఖ్యాంశాలు

రాష్ట్రపతిగా యశ్వంత్ సిన్హాను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందిః సిఎం కెసిఆర్‌

యశ్వంత్ సిన్హా కు స్వాగతం పలికిన అనంతరం యశ్వంత్ సిన్హా, సిఎం కేసీఆర్ జలవిహార్ చేరుకున్నారు. జలవిహార్ లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో యశ్వంత్ సిన్హా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జలవిహార్ లో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ….యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరముందని అన్నారు. మంచి నాయకుడిని తాము రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంచుకున్నామన్నారు. యశ్వంత్ సిన్హాను సమున్నత వ్యక్తిత్వమన్నారు. యశ్వంత్ సిన్హాకు తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరపున స్వాగతం పలికామన్నారు. లాయర్ గా, ఐఏఎస్ ఆఫీసర్ గా, రాజకీయ నేతగా యశ్వంత్ సిన్హా ఎదిగారన్నారు. ఆర్థిక, విదేశాంగ శాఖలు యశ్వంత్ సిన్హా సమర్థంగా నిర్వహించారన్నారు.

ఈసందర్భంగా కెసిఆర్‌ మోడీ మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు. విపక్షాలపై మోడీ అనేక ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రసంగాలు చేయడం కాదు.. మా ప్రశ్నలకు జవాబు ఇవ్వాలన్నారు. మోడీ చెప్పిన మాటలు ఏవైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. చెప్పిన ఒక్క మాట కూడా ఆయన నెరవేర్చలేదన్నారు. ఇది నేను చెప్పడం కాదు.. దేశమంతా చెప్తోందన్నారు. మమ్మల్ని మించిన మేధావి మరొకరు లేరని మీరనుకుంటున్నారన్నారు. డీజిల్, ఎరువులు, అన్నింటి ధరలు పెంచారన్నారు.