తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేసినందున హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఎల్లుండి నుంచి పూర్తిస్థాయిలో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 7గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రైళ్లు నడవనున్నాయి. చివరి స్టేషన్ నుంచి రాత్రి 9 గంటలకు చివరి మెట్రో సర్వీస్ బయలుదేరుతుంది. మెట్రో రైలులో ప్రయాణించేవారు తప్పనిసరిగా భౌతికదూరం పాటించడంతో పాటు మాస్క్ ధరించాలని హెచ్‌ఎంఆర్ పేర్కొంది.
హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు