జాతీయం ముఖ్యాంశాలు

దేశంలో క‌రోనా టీకా వేయించుకున్న‌వారి సంఖ్య‌ 27.62 కోట్లు

దేశంలో శ‌నివారం నాటికి 27.62 కోట్ల మంది ప్ర‌జ‌లు క‌రోనా టీకా వేయించుకున్నార‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శ‌నివారం 18-44 ఏండ్ల వ‌య‌సు వారిలో 20,49,101 మందికి తొలి డోసు టీకా, 78,394 మందికి రెండో డోసు టీకా ఇచ్చిన‌ట్లు చెప్పింది. అస్సాం, బీహార్, ఛత్తీస్‌గ‌ఢ్‌, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలో 18-44 ఏండ్ల వ‌య‌సు వారిలో ప‌ది ల‌క్ష‌ల మందికిపైగా తొలి డోసు క‌రోనా టీకా పొందార‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.