తెలంగాణ ముఖ్యాంశాలు

భారీగా వరద ప్రవాహం ..శ్రీరాంసాగర్‌ 20గేట్ల ఎత్తివేత..

భారీగా వరద ప్రవాహం ..శ్రీరాంసాగర్‌ 20గేట్ల ఎత్తివేత..

భారీ వర్షలతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువతో పాటు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండడంతో వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు 20 గేట్ల ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయానికి ప్రస్తుతం డ్యామ్‌కు 45,950 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు నుంచి 89,540 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

జలాశయంలో ప్రస్తుతం 1087.60 అడుగుల మేర నీరుండగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వసామర్థ్యం 90.30 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 70 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. మరో వైపు భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి ప్రవాహం కొనసాగుతున్నది. ఇవాళ ఉదయం 6 గంటలకు 53.40 అడుగుల వద్ద నీరు ప్రవహిస్తుండగా.. మూడో ప్రమాదహెచ్చరిక కొనసాగుతున్నది. ప్రస్తుతం నదిలో 14,45,047 క్యూసెక్కుల ప్రవాహం ఉన్నది.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/