చర్చలతో సమస్యలను పరష్కరించుకోవాలని చైనా, భారత్ కు సూచన
లడఖ్‌లో పర్యటిస్తున్న బౌద్ధ మత గురువు దలైలామా
బౌద్ధ మత గురువు దలైలామా లడఖ్‌లో పర్యటిస్తున్నారు. నెల రోజుల పాటు (ఆగస్ట్ 19 వరకు) ఆయన అక్కడే ఉంటారు. వందలాది మంది పౌరులు, సన్యాసులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో దలైలామా వివిధ మతాలు, రాజకీయ వర్గాలకు చెందిన వారితో సమావేశం అయ్యారు. తూర్పు లడఖ్ లో వాస్తవాధీన రేఖ వద్ద దీర్ఘకాలంగా చైనా, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా, అదే సమయంలో దలైలామా ఆ ప్రాంతానికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
‘‘భారత్, చైనా రెండూ కూడా అధిక జనాభా కలిగిన పొరుగు దేశాలు. ఇప్పుడైనా, తర్వాతైనా చర్చలు, శాంతియుత మార్గంలోనే ఈ సమస్యను (సరిహద్దు వివాదాలు) పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. సైనిక శక్తిని ఉపయోగిండానికి నేడు కాలం చెల్లిపోయింది’’ అని దలైలామా విలేకరులతో అన్నారు. ‘‘ప్రజలు దలైలామా పవిత్రతను గౌరవిస్తారు. వేలాదిగా ప్రజలు దలైలామాకు స్వాగతం చెప్పేందుకు ఇళ్ల నుంచి రోడ్లపైకి వచ్చారు’’ అని లడఖ్ బుద్ధిస్ట్ అసోసియేషన్ కు చెందిన తుప్ స్టాన్ చెవాంగ్ పేర్కొన్నారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/