ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

జగన్ బాటలో నారా లోకేష్

వైస్సార్సీపీ అధినేత , సీఎం జగన్ మోహన్ రెడ్డి బాటలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నడవబోతున్నారా..అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. జగన్ ఎలాగైతే పాదయాత్ర చేసి..అధికారం చేపట్టారో..ఇప్పుడు లోకేష్ కూడా అదే బాటలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని డిసైడ్ అయ్యారని సమాచారం.

నవంబరులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని, రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే వరకు పాదయాత్రను కొనసాగించాలని లోకేష్ నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రమంతా తిరిగే వరకు ఎలాంటి విరామం ఇవ్వకుండా మారథాన్ పాదయాత్ర చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే రోడ్‌ మ్యాప్‌ కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు సైతం బస్సు యాత్ర చేపట్టి జిల్లాల టూర్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అక్టోబర్ నుండి రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఇలా నేతలంతా యాత్రలు చేపట్టి ప్రజల మనసులను గెలిచి . అధికారం చేపట్టాలని చూస్తున్నారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/