హైదరాబాద్ శివారులోని శంషాబాద్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో టీపీసీసీ ముఖ్యనేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా (25) మృతి చెందారు. శంషాబాద్ పరిధిలోని శాతంరాయి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి వస్తుండగా ఈమె ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తానియా మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. తాలియా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు అంచనా వేస్తున్నారు. తానియా బ్యూటీషియన్‌గా పని చేస్తున్నట్లు సమాచారం.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/