ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

అచ్చెన్నాయుడు: వైఎస్ఆర్‌సిపి శ్రేణులే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు

చంద్రబాబు సీఎం కావాలని జనాలు ఎప్పుడో డిసైడ్ అయ్యారన్న అచ్చెన్న

టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై, సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. మూడేళ్ల పాలనలోనే జగన్ నైజం, ఆయన అసమర్థ పాలన గురించి వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు, అభిమానులకు కూడా అర్థమయిందని అన్నారు. జగన్ పాలనపై వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులు బహిరంగంగానే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాయని చెప్పారు. ఈసారి తమ సొంత పార్టీ గెలిచే పరిస్థితి లేదని వాళ్లే చెపుతున్నారని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

గత మూడేళ్లలో దళితులపై దాడులు, ఆడపిల్లలపై అత్యాచారాలు, కల్తీ మద్యం, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులు, భూ కబ్జాలు, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మట్టి మాఫియా, కోర్టు ధిక్కారాలు, చెత్త రోడ్లు, పూర్తిగా నిలిచిపోయిన అభివృద్ధి, లక్షల కోట్లలో ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తున్న అప్పులు, అధికార పార్టీ నేతల ఆగడాలు చూసి చూసి… సామాన్య ప్రజలు ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ఏపీకి సీఎం కావాలని ఎప్పుడో డిసైడ్ అయిపోయారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/