తెలంగాణ ముఖ్యాంశాలు

సర్దార్‌ సర్వాయి పాపన్న తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీకః సిఎం కెసిఆర్‌

నేడు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతి. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ ఆయను స్మరించుకున్నారు. సర్దార్‌ సర్వాయి పాపన్న తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని అన్నారు. ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాజరిక పోకడలకు వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి, పాపన్న పోరాడిన తీరు గొప్పదని సిఎం అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ.. బడుగు, బలహీనవర్గాల నాయకత్వాన్ని సముచితంగా గౌరవించుకుంటున్నదని అన్నారు. అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్ ప్రదర్శించిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్రం కొనసాగిస్తుందని సిఎం కెసిఆర్‌ స్పష్టం చేశారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/