nominations-tel
తెలంగాణ రాజకీయం

ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 606 నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. పరిశీలన తర్వాత ఎన్నికల బరిలో 2,898 మంది అభ్యర్థులు బరిలో ఉండనున్నారు. ఈ నెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నది. ఈ నెల 3న ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడిన విషయం తెలిసిందే.ఈ నెల 10 వరకు నామినేషన్ల కార్యక్రమం కొనసాగింది. 4798 మంది అభ్యర్థులు 5716 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నిన్నటి నుంచి నామినేషన్ల పరిశీలన కొనసాగింది. అత్యధికంగా గజ్వేల్‌లో 114 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆ తర్వాత మేడ్చల్‌లో 67, కామారెడ్డిలో 58, ఎల్బీనగర్‌లో 50, కొడంగల్‌లో 15 మంది, బాల్కొండలో 9 బరిలో ఉండగా.. అత్యల్పంగా నారాయణపేటలో 7 మంది అభ్యర్థులు పోటీలో ఉండననున్నారు.