ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

చంద్రబాబు పిచ్చాసుపత్రిలో చేరే రోజులు దగ్గరపడ్డాయని మంత్రి రోజా కామెంట్స్

టీడీపీ అధినేత చంద్రబాబు ఫై వైస్సార్సీపీ మంత్రి రోజా పలు ఘాటైన కామెంట్స్ కురిపించారు.చంద్రబాబు పిచ్చాసుపత్రిలో చేరే రోజులు దగ్గరపడ్డాయని .. కుప్పంలో చంద్రబాబు కోట కోట కూలిపోతోందని నిప్పులు చెరిగారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన మంత్రి రోజా ..నిన్న కుప్పం లో జరిగిన పరిణామాల ఫై స్పందించారు.

జగన్ ఎప్పుడు అభివృద్ధి కార్యక్రమాల కోసం బటన్ నొక్కినా దాన్ని రాద్దాంతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని మండిపడ్డారు. మొన్నటి వరకు ఒక ఫేక్ వీడియోను తిప్పారు ఇప్పుడు ఈ రకంగా ఆరోపణ చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు పిచ్చాసుపత్రిలో చేరే రోజులు దగ్గరపడ్డాయని , కుప్పంలో చంద్రబాబు కోట కోట కూలిపోతోందని నిప్పులు చెరిగారు రోజా. ఎన్టీఆర్, అమిత్ షా ను కలిసిన దగ్గర నుండి చంద్రబాబుకు వణుకు మొదలైందని సెటైర్లు పేల్చారు. బాలకృష్ణ ఆరోగ్య రథం ప్రారంభించినప్పుడు కూడా ఎన్టీఆర్, బాలకృష్ణ ఫోటోలు మాత్రమే రథంపై ఉన్నాయని ఎద్దేవా చేశారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/