కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా వదలడం లేదు.మూడేళ్లు కావొస్తున్నా ఇంకా కరోనా కొనసాగుతూనే ఉంది. మూడు డోస్ లు వేసుకున్న కానీ కరోనా ఒంట్లోకి చొరబడుతుంది. ఇటీవల కాలంలో తెలంగాణాలో రాజకీయనేతలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. తాజాగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కరోనా బారినపడ్డారు. ఇటీవల కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన.. నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ మేరకు సోమవారం రిపోర్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వయంగా వెల్లడించారు.
కరోనా బారిన పటడంతో సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లినట్లు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇటీవల కాలంలో తనను కలిసి వారు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. కరోనా స్వల్ఫ లక్షణాలు ఉన్నా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. అలాగే కరోనా వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 9వేలకుపైగా కేసులు రికార్డవగా.. తాజాగా 7వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 27 గంటల్లో 7,591 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 9,206 మంది బాధితులు కోలుకున్నారు. మరో వైపు 45 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,44,15,723కు పెరిగింది. ఇందులో 4,38,02,993 మంది కోలుకున్నారు. మొత్తం 5,27,799 మంది కరోనా మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 84,931 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/