ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిన కేసులో మయన్మార్ కోర్టు ఇవాళ ఆంగ్ సాన్ సూకీకి మూడేళ్ల జైలు శిక్షను విధించింది. అయితే ఇప్పటికే పలు కేసుల్లో ఆమెకు 17 ఏళ్ల జైలు శిక్ష ఖరారైంది. ఇవాళ విధించిన శిక్ష దానికి అదనం కానున్నది. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీకి చెందిన సూకీ భవిష్యత్తు ఇప్పుడు మరింత నిరాశజనకంగా మారింది. 2023లో ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో మిలిటరీ హామీ ఇచ్చినా.. సూకీ జైలు శిక్షతో ఆ ఎన్నికలపై నీలినీడలు కమ్ముకున్నట్లు స్పష్టమవుతోంది. 2020 జనరల్ ఎలక్షన్‌లో సూకీ పార్టీ విజయం సాధించింది. అయితే 2021, ఫిబ్రవరి ఒకటో తేదీన సూకీ పార్టీ నుంచి అధికారాన్ని మిలిటరీ లాగేసుకున్నది. ఎన్నికల సమయంలో హెచ్చు స్థాయిలో ఫ్రాడ్ జరిగినట్లు సూకీపై ఆరోపణలు వచ్చాయి. అయితే సూకీతో పనిచేసిన మాజీ సీనియర్ సభ్యుల్ని ఈ కేసులో మిలిటరీ అరెస్టు చేసింది.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/