అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం
నేడు ఏపి కేబినెట్ సమావేశం జరుగనుంది. సిఎం జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో మంత్రివర్గ సమావేశ మందిరంలో ఈ భేటీ జరుగుతుంది. పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి, నిర్ణయాలు తీసుకోబోతున్నారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. అసెంబ్లీ సమావేశాలపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మూడు రాజధానులపై చర్చించే అవకాశం కూడా ఉందని సమాచారం.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/