ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

‘భగవంతుని సన్నిధిలో అశోక్‌గజపతిరాజు అసత్యాలు మాట్లాడటం తగదు’

భగవంతుని సన్నిధిలో అశోక్‌గజపతిరాజు అసత్యాలు మాట్లాడటం తగదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రొటోకాల్‌పై అశోక్‌గజపతిరాజు అసత్యాలు మాట్లాడుతున్నారని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో సేవలన్నీ ఏకాంతంగానే జరుగుతున్నాయని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో తలపాగ చుట్టలేదని అశోక్‌గజపతిరాజు మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. భగవంతుని సన్నిధిలో అబద్ధాలు మాట్లాడితే అశోక్‌గజపతిరాజుకు శిక్ష తప్పదని హెచ్చరించారు. మాన్సాస్ ట్రస్టులో గత పదేళ్ల నుంచి ఆడిటింగ్ జరగలేదని, అందులో అవినీతిని తేల్చేందుకే ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ చేస్తున్నామని చెప్పారు. మాన్సాస్‌ ట్రస్ట్ బోర్డు వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామన్నారు.