ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

ఏపీ లో నవంబర్ 1 నుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిషేధం అమలు, ఉల్లంఘనలు, వాటిపై చర్యలు, ప్రత్యామ్నాయాలు తదితరాలకు సంబంధించి గురువారం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ను ఇచ్చింది. రాష్ట్ర అటవీ పర్యావరణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నోటిఫికేషన్ ను జారీ చేశారు. నవంబర్ 1 నుంచి ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై పూర్తి బ్యాన్ ఉంటుందని స్పష్టం చేసింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ప్రింట్ చేయడం, ట్రాన్స్‌పోర్ట్ చేయడం, వినియోగించడం, ప్రదర్శించడంపై బ్యాన్ విధిస్తున్నట్లు పేర్కొంది. గ్రామాల్లో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు వాడకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని గవర్నమెంట్ స్పష్టం చేసింది. నిషేధం అమలుకు నగరాలు, పట్టణాల్లో.. పోలీస్‌, రవాణా, జీఎస్టీ అధికారులు రెస్పాన్స్‌బులిటీ తీసుకోవాలని ఆదేశించింది.

నిబంధనలు లైట్ తీస్కోని.. బ్యానర్స్ ప్రదర్శించినా, ప్రింట్ చేసినా ఫ్లెక్సీకి రూ.100 చొప్పున ఫైన్ వేస్తామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ప్లాస్టిక్‌కు బదులుగా కాస్త ఖర్చు ఎక్కువైనా కాటన్‌, నేత వస్త్రాలు వినియోగించాలని ఉత్తర్వుల్లో సూచించింది. ఇటీవల వైజాగ్‌ లో పర్యటించిన సమయంలో ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. టీటీడీలో ఇప్పటికే ప్లాస్టిక్‌ లేకుండా చేసి సఫలీకృతం అయ్యామని… అక్కడ మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ లేకుండా చేసేందుకు.. ప్రజల భాగస్వాయ్యం అవసరం అని చెప్పారు. మరోవైపు సముద్రాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ‘పార్లే ఓషన్‌’ సంస్థతో ఏపీ సర్కార్ ఒప్పుదం చేసుకున్న విషయం తెలిసిందే.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/