ఖమ్మం జిల్లాలో ఇంజక్షన్ హత్యలు సంచలనం రేపుతున్నాయి. రెండు రోజుల క్రితం వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ఇంజక్షన్ వేసి హత్య చేయించిన ఘటన మరవకముందే..తాజాగా మరో ఇంజక్షన్ హత్య వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తే..భార్య ను ఇంజక్షన్ చేసి చంపాడు.
వివరాల్లోకి వెళ్తే..
ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాకు చెందిన భిక్షం ఓ డాక్టర్ వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. అతడికి మొదటి భార్యతో సంతానం కలగకపోవడంతో.. తన కంటే 20 ఏళ్లు చిన్నదైన నవీన అనే మరో అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. ఆమెకు తొలుత పాప పుట్టింది. ఆ తర్వాత భార్యలిద్దరి మధ్య గొడవలు జరిగాయి. నవీన మరోసారి గర్భం దాల్చింది. ప్రసవం కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. రెండోసారి ఆడపిల్లే పుట్టింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో విసిగిపోయిన భిక్షం ప్రసవించిన రోజే నవీనకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడు. ఏమీ తెలియనట్టు ఆస్పత్రి నిర్లక్ష్యంతోనే చనిపోయిందని బంధువులతో కలిసి ఆందోళనకు దిగాడు. అనుమానం వచ్చిన ఆస్పత్రి సిబ్బంది.. సీసీకెమెరా దృశ్యాలు పరిశీలించగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/