కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మూడోసారి పొడిగించడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ పదవీకాలం పొడిగింపు అక్రమమంటూ మోదీ సర్కారుకు మొట్టికాయలు వేసింది.
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మూడోసారి పొడిగించడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ పదవీకాలం పొడిగింపు అక్రమమంటూ మోదీ సర్కారుకు మొట్టికాయలు వేసింది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గౌరవ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వును కొట్టిపారేసింది.
అంతేగాక, ఈ నెల 31న సంజయ్ కుమార్ మిశ్రా ఈడీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలని కోర్టు ఆదేశించింది. ఈలోగా ఈడీ నూతన డైరెక్టర్ నియమకాన్ని పూర్తి చేయాలని కేంద్రానికి సూచించింది. దాంతో సంజయ్ మిశ్రా ఈ నెల 31న తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడింది. లేదంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది నవంబర్ 18 వరకు సంజయ్ మిశ్రా ఈడీ డైరెక్టర్‌గా కొనసాగేవారు.
ఈ తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మరో విషయాన్ని కూడా స్పష్టం చేసింది. సీబీఐ, ఈడీ డైరెక్టర్‌ల నిర్ణాయక రెండేళ్ల పదవీకాలం పూర్తయ్యాక మరో మూడేళ్లపాటు వారి పదవీకాలాలను పొడిగించేలా కేంద్ర ప్రభుత్వానికి అధికారాలను కట్టబెట్టిన చట్టాలకు సవరణలు జరిగిన విషయాన్ని సుప్రీంకరోర్టు గుర్తు చేసింది.