tehsildhar
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

తాసిల్దార్ కార్యాలయం ఎదుట జీడి రైతులు వినూత్న నిరసన

పలాస తాసిల్దార్ కార్యాలయం ఎదుట వర్షంలో జిడి రైతుకు న్యాయం చేయాలని వామపక్ష నాయకులు జీడి పిక్కల బస్తా కాలుస్తూ వినూత్న నిరసన తెలిపారు. రైతుల పండించే 80 కిలోల బస్తా పిక్కలు ధర రూ. 16 వేలు కల్పించి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దళారు వ్యవస్థకు వైసీపీ ప్రభుత్వం కొమ్ముకాయ వద్దని, రైతులకు ఆత్మహత్యల వైపు ఉసుగొలపవద్దని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా పలువురు వామపక్ష నాయకులు మాట్లాడుతూ తక్షణమే వైసిపి ప్రభుత్వం కలుగజేసుకొని జీడి రైతులకు న్యాయం చేయాలని లేని పక్షంలో ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.కేరళ, గోవా తదితర రాష్ట్రాల మాదిరిగా జీడి రైతులకు బోర్డు నెలకొల్పి రైతులకు ఆదుకోవాలని కోరారు. జీడి పంటకు జాతీయ పంటల జాబితాలో చోటు కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు వంకల మాధవరావు, చాపర వేణుగోపాల్, చాపర వెంకటరమణ, తామాడ సింహాచలం, సిఐటియు గణపతి, మద్దిల రామారావు, కామేశ్వరరావు, జీడి రైతులు పాల్గొన్నారు.