బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్& రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ 24వ వార్షికోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్, ప్రస్తుత ఏపీ సీఎం చంద్ర బాబులను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ ఆలోచనతో ఏర్పడ్డ ఈ ఆసుపత్రి 24ఏళ్లుగా కోట్లాది మందికి సేవలందించడం సంతోషంగా ఉందన్నారు. పేదలకు సేవలందించే ఉద్దేశంతో ఆనాడు ఎన్టీఆర్ ఈ ఆసుపత్రి నిర్మాణానికి పూనుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్ ఆలోచన విధానాలను కొనసాగించాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఆసుపత్రిని పూర్తి చేసి పేదలకు సేవలు అందించేలా చేశారన్నారు. పేదలకు వైద్య సేవలు అందించాలన్న ఎన్టీఆర్ ఆలోచనలు అమలవుతున్న తీరు చూసి ఆయన మనల్ని స్వర్గం నుంచి ఆశీర్వదిస్తారని చెప్పారు. ఆసుపత్రికి సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్నా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
అభివృద్ధి, సంక్షేమంలో చంద్రబాబు నాయుడుతో పోటీ పడి పని చేసే అవకాశం తనకు గతంలో వచ్చిందని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. అభివృద్ధి, సంక్షేమంలో ప్రపంచానికి తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలవాలన్నారు. తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్‌ను ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని ఈ సందర్భంగా వెల్లడించారు. అన్ని రకాల వైద్య సేవలు అందేలా హెల్త్ టూరిజం హబ్ ఉంటుందని చెప్పారు. ఇందులో బసవతారకం ఆసుపత్రికి చోటు ఖచ్చితంగా ఉంటుందని భరోసా కల్పించారు.వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా హైదరాబాద్‌కు వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందుతాయనేలా తీర్చిదిద్దుతామన్నారు. రాజకీయం, సంక్షేమం ఈ రెండింటిని ఎన్టీఆర్ వారసత్వంగా ఇచ్చారని కీర్తించారు.ఎన్టీఆర్ మూడో తరం కూడా దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
నందమూరి బాలకృష్ణ తనను 25వ వార్షికోత్సవంకు రావాలని కోరుతున్నారు.. 30వ వార్షికోత్సవానికి కూడా తానే వస్తానని సీఎం రేవంత్ చెప్పారు. ఆస్పత్రి లీజ్ వివాదాన్ని క్యాబినేట్ నిర్ణయం తీసుకుని పరిష్క రించామన్నారు.గతంలో తాను 12 గంటలు పని చేస్తే చాలు అనుకునే వాడిని.. కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి 18 గంటలు పని చేసే వ్యక్తిఅని చెప్పారు. ఒక ఆటగాడి నైపుణ్యం తెలియాలి అంటే మరొక మంచి ఆటగాడితో పోటీ పడాలన్నారు. ఇప్పుడు ఏపీలో సీఎంగా చంద్రబాబు ఉన్నారని.. దీంతో తనతో సహా రాష్ట్రంలోని అధికారులంతా అంతే ధీటుగా 18 గంటలు పని చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. మూడోతరం అయిన లోకేష్ బాబు, భరత్ రాజకీయాల్లో, సంక్షేమంలో ఎలాంటి మార్క్ కనబరుస్తారో చూడాలని సీఎం రేవంత్ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్ ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్‌లో ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 24వ వార్షికోత్సవంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో హెల్త్ టూరిజం హబ్ గురించి ప్రకటించారు. అన్ని రకాల వైద్య సేవలు అందేలా హెల్త్ టూరిజం హబ్ ఉంటుందన్నారు. ఇందులో బసవతారకం ఆసుపత్రికి చోటు ఖచ్చితంగా ఉంటుందని.. వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా హైదరాబాద్ కు వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందు తాయనేలా తీర్చిదిద్దుతామన్నారు. ఎన్టీఆర్ ఆలోచనతో ఏర్పడ్డ ఈ ఆసుపత్రి 24 ఏళ్లుగా కోట్లాది మందికి సేవలందించడం సంతోషమని రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకు సేవలందించే ఉద్దేశంతో ఆనాడు ఎన్టీఆర్ ఈ ఆసుపత్రి నిర్మాణం చేశారన్నారు. ఎన్టీఆర్ ఆలోచన విధానాలను కొనసాగించాలని చంద్రబాబు నాయుడు ఆసుపత్రిని పూర్తి చేసి పేదలకు సేవలు అందించేలా చేశారని అభినందించారు.
పేదలకు వైద్య సేవలు అందించాలన్న ఎన్టీఆర్ ఆలోచనలు అమలవుతున్న తీరు చూసి ఆయన మనల్ని స్వర్గం నుంచి ఆశీర్వదిస్తారన్నారు. పేదలకు క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడేయడానికి, వైద్యరంగానికి విశేష కృషి చేసిన ఎన్టీఆర్ బసవతారం ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.