గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో 175 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి తద్వారా 50 కోట్ల బ్యాంకు రుణం పొంధరంటూ హైకో ర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.మాల్పూరి ఆగ్రోటెక్, శ్రీవత్స వ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ల ద్వారా వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమ మార్గాల విక్రయ పత్రాలు సృష్టించి తద్వారా బ్యాంకు రుణం పొందారన్న వార్తలపై నేరుగా ఎమ్మెల్యే స్పం దించారు.తనపై కొంతమంది కావాలనే విమర్శలు చేస్తు న్నారని చెప్పారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయ మనుగడ కోసమె ఇలాంటి ఆరోపణలు చేస్తూన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఆ బ్యాంక్ లో అకౌంట్ లేనప్పుడు ఏవిధంగా లోన్ తీసుకుంటానని ప్రశ్నించా రు.