dogs
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

నూజివీడులో వీధి కుక్కల హల్ చల్

నూజివీడు మున్సిపాలిటీలో కుక్కలు వీర విహారం చేస్తూన్నాయి.  అప్సర థియేటర్ వెనక,  రామాలయం గుడి సెంటర్, బీఫార్మసీ కాలేజ్ బాపునగర్లో ఒకే కుక్క ఏడుగురు మీద దాడి చేసింది.  వేరువేరు చోట్ల దాడి చేసింది. కార్తీక్ సింగ్(8) టీ,సాయి (12)ఇంకో పాప బంగినపల్లి తోట (11), టీ.హేమలత (35)లకు గాయాలయ్యాయి. నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురికి చికిత్స అందించారు. ముగ్గురు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నట్లు సమాచారం.ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించే వీధి కుక్కలపై చర్యలు తీసుకొని పట్టించుకోవాలని స్థానికులు కోరుతున్నారు.కుక్క కాటుకు గురైన బాధితులను స్థానిక తాహాసిల్దార్ ఎల్లారావు పరామర్శించారు.