తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అని ఆరోపించారు. జగన్ పోవాలి..సీమలో సిరులు పండాలి. ఒక్క జీవోతో సీమలో 102 ప్రాజెక్టుల పనులు రద్దు చేశాడు. సీమ ప్రాజెక్టులపై 5 ఏళ్లలో టీడీపీ ఖర్చు..రూ. 12,411 కోట్లు….వైసీపీ ఖర్చు రూ. 2011 కోట్లు. సీమలో మేం కులం చూడలేదు…కరువు చూశాం. సీమ ప్రాజెక్టులపై ఖర్చు కంటే….సొంత పత్రిక ప్రకటనల ఖర్చు, సలహాదారుల జీతాల మొత్తమే ఎక్కువ. చేసిన ద్రోహానికి రాయలసీమ రైతాంతాగానికి జగన్ క్షమాపణ చెప్పాలని అన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రాయలసీమ తీవ్ర నీటి ఎద్దడి ఉంటుంది.
ఈ కారణంగా సీమ నీటికష్టాలు తీర్చ డానికి ఎన్.టీ.రామారావు తెలుగుగంగ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. కృష్ణా మిగులు జలాలను కరువుప్రాంతానికి అందించడంకోసం, నలుగురు ముఖ్యమం త్రులను కన్విన్స్ చేశారు. ఆ ప్రాజెక్ట్ తో తమిళనాడుకు కూడా తాగునీరు అందించారు. తెలుగుగంగ తర్వాత గాలేరునగరి, హంద్రీనీవా ప్రాజెక్టులతో మొత్తం రాయలసీమ ను సస్యశ్యామలం చేయాలని ఎన్.టీ.ఆర్ తలచారు.
నేను వచ్చాక పట్టిసీమ నిర్మించి, కృష్ణా జలాలను సీమకు అందించాను. దేశమంతా ఆలోచిస్తున్న నదుల అనుసంధానం ప్రాజెక్ట్ లో ఇదొక తొలిఅడుగు. నదుల అనుసంధానం చేయగలగితే రాష్ట్రంలో ప్రతిఎకరాకు నీరుఇవ్వవచ్చని ఆలోచించి దానికి అను గుణంగా ఒక బ్లూ ప్రింట్ తయారుచేశాముని అన్నారు.
గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా నదులతోకలిపి మొత్తం రాష్ట్రంలో చిన్నవి పెద్దవి 69 నదులు ఉన్నాయి. గోదావరిపై నిర్మించిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే, ఆ నీటిని నేరుగా వివిధ మార్గాల్లో ఇచ్ఛాపురం వరకు అందించేలా ప్రణాళికలు వేశాం. అదే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్. మరోపక్క పోలవరం కుడికాలువద్వారా ప్రకాశం బ్యారేజీకి నీటిని తరలించి, శ్రీశైలంలోని కృష్ణా నీటిని రాయలసీమకు తరలించేలా ప్రణాళికలు తయారుచేశాం. ఇంకోపక్కన ప్రకాశం బ్యారేజీ కి వచ్చే కృష్ణానీటిని వైకుంఠపురంలో ఒక బ్యారేజీ కట్టి, అక్కడినుంచి పల్నాడుజిల్లా నకరికల్లులోని నాగార్జున సాగర్ కుడికాలువకు కలపాలని ఆలోచించాము.
దీనికి సంబంధించిన పనులకు టెండర్లు కూడా పిలవడం జరిగిం ది. అదేసమయంలో బొల్లాపల్లిలో రిజర్వాయర్ కట్టి, నల్లమల ఫారెస్ట్ లో ఒక 35 కిలోమీటర్ల టన్నెల్ నిర్మిస్తే, గోదావరి నీరు నేరుగా పెన్నానదికి వెళ్తుంది. అక్కడి నుంచి నేరుగా రాయలసీమలోని అన్నిరిజర్వాయర్లకు కేంద్రబిందువైన బనకచర్ల రిజర్వాయర్ కు నీటిని తరలిస్తే, అక్కడినుంచి కండలేరు, సోమశిలవరకు నీటిని పంపవచ్చు. ఈ మొత్తం ప్రణాళికతో నదుల అనుసంధానం మొత్తం పూర్తవుతుంది. ఈ విధమైన ఆలోచన, దూరదృష్టితో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ఆలోచించానని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి టీడీపీ ఐదేళ్లలో రూ.68,293కోట్లు ఖర్చుపెడితే, వైసీపీ నాలుగేళ్లలో రూ.22,165 కోట్లు మాత్రమే వెచ్చించింది.
మా ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి 2014-19లో రూ. 68,293కోట్లు ఖర్చుపెట్టింది. ఈ ప్రభుత్వం రూ.22,165కోట్లు ఖర్చుపెట్టింది. మొత్తం బడ్జెట్లో టీడీపీప్రభుత్వం 9.63శాతం నిధుల్ని సాగునీటి రంగానికి ఖర్చుపెడితే, ఈ ప్రభుత్వం 2.35శాతమే ఖర్చుపెట్టింది. ఆ నిధులు పనులు చేయడానికి కాదు.. కమీషన్లు ఇచ్చే కాంట్రాక్ట్ సంస్థలకు దోచి పెట్టారు. సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యత ఈ ముఖ్యమంత్రికి తెలియదు. నాటకాలు ఆడాడు. మొదటిసారి అసెంబ్లీలో మాట్లాడు తూ, గోదావరి నీటిని శ్రీశైలానికి తీసుకొస్తానని ప్రగల్భాలు పలికాడు. తెలంగాణ ముఖ్య మంత్రి ఒప్పుకున్నాడని గొప్పలు చెప్పాడని విమర్శించారు.