rain
తెలంగాణ ముఖ్యాంశాలు

తెలుగు రాష్ట్రాలకు డేంజర్‌ వార్నింగ్‌

తెలుగు రాష్ట్రాలకు డేంజర్‌ వార్నింగ్‌ ఇస్తోంది వాతావరణశాఖ. మరో రెండు మూడు గంటల్లో కుండపోత వర్షం కురుస్తుందని హెచ్చరిక జారీ చేసింది. ఏపీలో 10జిల్లాలకు , తెలంగాణలో 5 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఇక కొత్తగూడెం జిల్లా సత్యనారాయణపురం, ఆర్‌. కొత్తగూడెం దగ్గర రోడ్లపైకి భారీగా వరదనీరు చేరింది. భద్రాచలం-చర్ల మధ్య వర్షపునీరు నిలిచిపోయింది. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.తెలంగాణలో మొత్తం 15జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది వాతావరణశాఖ. అటు వరంగల్‌జిల్లా కాజీపేటలో పిడుగుపడి ఇంట్లో వస్తువలన్నీ ధ్వంసం అయ్యాయి. పిడుగు బీభత్సంతో గోడలు విరిగిపడ్డాయి. దాంతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు.

ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కాలిపోయాయి. రాష్ట్రానికి 5 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ వాతావరణశాఖ అధికారులు. హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తడంతో రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌ దగ్గర మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఓఆర్‌ర్‌ సర్వీస్‌ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. బాపుఘాట్‌ దగ్గర మూసీ ప్రవాహం పెరిగింది. పరీవాహక ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం బలపడటంతో రానున్న మూడు రోజులపాటు ఏపీలో వానలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. దాంతో ఏపీలో 10 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు తేలికపాటి, మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. అటు విశాఖలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షం పడింది. భారీ వర్షాలకు నంద్యాల జిల్లా పాములపాడు మండలం మిట్టకందాలలో రెండు మిద్దెలు కూలాయి. ఐతే ఆ సమయంలో ఎవరు ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకుఎ వృక్షాలు నేలకూలాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంది పొర్లుతున్నాయి.ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం దగ్గర గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. గోదావరి నీటిమట్టం 45 అడుగులు దాటింది. రామాలయం చుట్టూ వరదనీరు చేరింది. విస్తా కాంప్లెక్స్‌, అన్నదాన సత్రం నీట మునిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కట్టవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. సుందరయ్యనగర్‌లో వందలాది ఇళ్లు జలమయం అయ్యాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కొత్తగూడెం జిల్లా పాల్వంచ కిన్నెరసాని జలశయానికి జలకళ ఉట్టిపడుతోంది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి భారీగా వరదనీరు చేరుతోంది. దాంతో 5 గేట్లు ఎత్తి దిగువకు 29వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైరన్‌ ద్వారా అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఉభయ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి వానలు పడ్డాయి. అల్లూరిజిల్లా చింతూరు ఏజెన్సీలో జోరుగా వానలు కురుస్తున్నాయి. దాంతో శబరినది ఉప్పొంగి ప్రవహిస్తోంది. చింతూరు వద్ద 29 అడుగులకు వరదనీరు చేరింది. సోకిలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. చింతూరు-వీఆర్‌పురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.