వేలేరుపాడు మండలంలో పోలవరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కి చుక్కెదురైంది. వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నార్లవారం పంచాయితీలో జరుగుతున్న జగన్న సురక్ష కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకొని తిరిగి వేలేరుపాడు వస్తుండగా భుదేవిపేట వద్ద వేలేరుపాడు అఖిలపక్షం అడ్డుకోబోయింది.
సమాచారం తెలుసుకున్న ఎస్సై లక్ష్మీ నారాయణ సంఘటన స్థలానికి చేరుకొని అఖిలపక్షం సభ్యులతో మాట్లాడి ఎమ్మెల్యే తో మాట్లాడే అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. తరువాత వచ్చిన ఎమ్మెల్యే అగకపోవడంతో పోలీసులకు అఖిలపక్షం మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం సుమారు మూడు గంటల పాటు ధర్నా చేసారు.తరువాత అయన తిరుగు ప్రయాణంలో ఆగి అఖిలపక్షం వారు చెప్పిన సమస్యలు విన్నారు.
గోదావరి వరదలు వచ్చి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రజా సమస్యలు వదిలేసి ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరుకావడం హాస్యాస్పదంగా ఉన్నది అని అఖిలపక్షం సభ్యులు ఆరోపించారు.ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉంటే ప్రభుత్వనికి పట్టడం లేదు అని గత వరదలకు నష్టపోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన సహాయం పూర్తి స్థాయిలో ఇంకా అందలేదు.ఇప్పుడు కూడా బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని ధ్వజమెత్తారు.ప్రభుత్వ కార్యక్రమనికి రావడానికి సమయం కేటాయించారు కానీ ప్రజలు గత ఇరవై రోజుల నుండి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే రాని ఎమ్మెల్యే ఇలాంటి కార్యక్రమాలకు ఎలా హాజరవుతున్నారు అని అన్నారు.