chandrababu
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

చంద్రబాబు సీమ పర్యటన ఖరారు

రాయలసీమలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్య టన ఖరారైందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు.ఈ సంద ర్భంగా ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ…ఆగస్టు 1వ తేదీ నుంచి రాయలసీమలో సాగు నీటి ప్రాజెక్టుల సందర్శన ఉంటుందని, 3న గండికోట రిజర్వాయర్ పరిశీలన తర్వాత అనంతపురం జిల్లాకు చంద్ర బాబు వస్తారని తెలిపారు.4న కళ్యాణ దుర్గంలో బైరవానితిప్ప ప్రాజెక్టు, పేరూర్లో ఇతర ప్రాజెక్టులు పరిశీలి స్తారని తెలిపారు. రాయలసీమ భవిష్యత్తో సీఎం జగన్ ఆటలాడు కుంటున్నారని విమర్శించారు. కరువు జిల్లాలకు నీరు అందించే ప్రాజెక్టులను సీఎం జగన్ ఆపేశారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి అసమర్ధత వల్ల రాయ లసీమలో వేరుశనగ పంట దిగుబడి తగ్గిందని, రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులపై పరిశీలన జరుగుతుందని కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. రాయలసీమ జీవనాడి లాంటి హంద్రీ నీవా వెడల్పును ఈ ప్రభుత్వం ఆపేసిం దని, పది వేల క్యూసెక్కుల సామర్థ్యం తో నిర్మిస్తానని చెప్పి టెండర్లు కూడా పిలవలేదని మండిపడ్డారు. జరిగే పనులు ఆపివేసి అనంతపురం జిల్లా కు తీవ్ర అన్యాయం చేశారన్నారు. జిల్లా మనవడునని చెప్పి ముఖ్యమం త్రి ప్రాజెక్టులు ఆపివేసి నయవంచనకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను ఎందగ ట్టెందుకే చంద్రబాబు పర్యటన చేయ నున్నారని తెలిపారు. రైతులు పెద్ద ఎత్తున పాల్గొని చంద్రబాబు పర్యటన ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.