kcr
తెలంగాణ రాజకీయం

రాష్ట్రం ఆగమాగం వరద పరిస్థితిని సమీక్షించిన కేసీఆర్ వేలాది ఎకరాల పంట నీటి మునక ధ్వంసమైన రోడ్లు, వంతెనలు

తెలంగాణలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో అనేక చోట్ల రోడ్లు, ఇళ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో వర్షాల ప్రభావానికి రాష్ట్రంలో మొత్తంగా 49 బ్రిడ్జీలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. అలాగే చాలావరకు రహదారులు కోతకు గురైనట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కాస్తంత తగ్గుముఖం పట్టాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే వర్షాలు తగ్గడంతో.. వరదలు తగ్గుముఖం పట్టి బురద మయమైన ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాల పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో రోజు క్షేత్రస్థాయి పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో సాగుతున్న సహాయక, పునరావాస చర్యలపై మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మాట్లాడి, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు.ఇంకొన్నింటపై గుంతలు పడ్డాయని పేర్కొన్నారు.భారీ వర్షాలు, వరదలతో వరంగల్ నగరం అతలాకుతలమవుతోంది.

గతంలో ఎన్నడూ లేనంతగా వరద ప్రవాహం వరంగల్ నగరాన్ని చుట్టుముట్టింది. దీంతో నగరం మొత్తం జలమయంగా మారింది. కాగా.. వరద పోటెత్తడంతో వరంగల్‌లోని భద్రకాళి చెరువుకు గండి పడింది. భద్రకాళి చెరువు కట్ట పోతన నగర్‌ వైపు కోతకు గురైంది. చెరువుకు వరద పోటెత్తడంతో గండి పడినట్లు అధికారులు తెలిపారు. వరద ఉధృతికి చెరువు కట్ట తెగిపోయిందని.. ప్రజలు అప్రమత్తంగడా ఉండాలని సూచించారు. ప్రాచీన కాలం నాటి భద్రకాళి చెరువు కట్టకు గండి పడటంతో పోతననగర్‌, సరస్వతి నగర్‌ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.అధికారులు హుటాహుటిన చెరుకుని భద్రకాళి చెరువు కింద ఉన్న ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. గండి పడిన ప్రాంతంలో ఉన్న కాలనీల వాసులు ఇళ్లు ఖాళీ చేయాలని పేర్కొన్నారు. పోతన నగరల్ వైపు వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో..

ఆయా ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు.ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో.. అన్ని ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే రెస్క్యూ టీం ఆయా ప్రాంతాలకు చేరుకుంటున్నారు. దిగువున ఉన్న ప్రజలను ఖాళీ చేయాలని సూచనలు చేస్తున్నారు.కాగా.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరంగల్ నగరం తీవ్రంగా ప్రభావితమైంది.. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. పలువురి రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే వర్షాలు, వరదల ప్రభావంతో దాదాపు 10 మంది వరకు మరణించారు.
49 వంతెనలు ధ్వంసం
రాష్ట్రంలో మొత్తంగా 49 బ్రిడ్జీలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. అలాగే చాలావరకు రహదారులు కోతకు గురైనట్లు పేర్కొన్నారు. ఇంకొన్నింటపై గుంతలు పడ్డాయని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం వరకూ కూడా అనేక ప్రాంతాల్లో వరద ప్రవాహం కొనసాగింది. చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేశారు. జాతీయ రహదారులకు సంబంధించి 11 చోట్ల వంతెనలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర రహదారుల విషయంలో 38 ప్రాంతాల్లో బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అత్యధికంగా 15 వంతెనలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.
అలాగే జగిత్యాల జిల్లాలో 10 బ్రిడ్జిలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4 , ఆదిలాబాద్‌లో 3 వంతెనలు దెబ్బతిన్నాయి. ఇంకా జనగామ, మంచిర్యాల, ములుగు, వరంగల్, భూపాలపల్లి జిల్లల్లో చూసుకుంటో 2 చొప్పున బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి.

250 ప్రాంతాల్లో రహదారులపై వరద ప్రవహించినట్లు అధికారులు చెప్పారు. అదిలా ఉండగా ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోని రహదారుల తాత్కాలిక మరమ్మతుల కోసం క్షేత్రస్థాయిలో ఉన్న నిధులు వాడుకోవాలని ప్రభుత్వం తెలిపింది. దాదాపు రూ.120 కోట్లు వాడుకోవాలని సూచించింంది. ఒకవేళ భారీ మరమ్మతులు ఉంటే రాష్ట్రస్థాయికి ప్రతిపాదనలు పంపాలని కోరింది. అలాగే జాతీయ రహదారుల మరమ్మతు కోసం రూ.29 కోట్లు అవసరమని ఇందుకోసం నిధులు మంజూరు చేయాలని జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖను కోరినట్లు అధికారులు పేర్కొన్నారు.
అంటూ వ్యాధులు రాకుండా చూడండి- సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కాస్తంత తగ్గుముఖం పట్టాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే వర్షాలు తగ్గడంతో.. వరదలు తగ్గుముఖం పట్టి బురద మయమైన ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాల పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో రోజు క్షేత్రస్థాయి పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో సాగుతున్న సహాయక, పునరావాస చర్యలపై మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మాట్లాడి, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. వరద ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

బురదమయం అయిన ప్రాంతాల్లో అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయసహకారాలు అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. వరదల నేపథ్యంలో ప్రజారోగ్యం, శ్రేయస్సును కాపాడటానికి తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు వరద తాకిడి, ముంపునకు గురైన ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి హెచ్చరికలు చేస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహార పొట్లాలు, తాగు నీరు, మందులను హెలికాప్టర్‌ ద్వారా అందించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మూడో రోజు గోదావరి ముంపునకు గురైన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. భారీ వర్షాలతో చెరువులు తెగడం, రహదారులు, బ్రిడ్జ్ లు కోతకు గురికావడంతో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలించారు.

ఖమ్మం జిల్లా మున్నేరు వాగు తగ్గు ముఖం పట్టే వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లాలో భారీ వర్షాలు, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష చేపట్టారు. వరద ఉద్ధృతి తగ్గి పరిస్థితులు కుదుటపడుతున్న జీహెచ్ఎంసీ పరిధిలో సహాయక కార్యక్రమాలను కొనసాగించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్గి పరిస్థితులు కుదుటపడుతున్నందున, పలువురు మంత్రులు ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యలతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా పటిష్ట కార్యాచరణను అనుసరించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయ, పునరావాస చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టినందున, వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.