education policy
ఆంధ్రప్రదేశ్

డిగ్రీ కళాశాలలో ప్రవేశపెట్టిన నాలుగు సంవత్సరాల నూతన విద్యా విధానం-అవగాహన సదస్సు

స్థానిక నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఈరోజు అనగా 29 – 7 – 2023న డిగ్రీ కళాశాలలో నాలుగు సంవత్సరాల నూతన విద్యా విధానం అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సు కు కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు .”IQAC మేజర్ సబ్జెక్టు “అంశంపై IQAC కోఆర్డినేటర్ డాక్టర్ కే సురేష్ ఈ అంశం పైన అధ్యాపక సిబ్బందికి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో “ఏపీ ఎస్ సి హెచ్ ఈ” వారు ప్రవేశపెట్టిన ఆనర్స్ డిగ్రీ నాలుగు సంవత్సరాల కోర్సు గురించి క్షుణ్ణంగా వివరించారు. ఈ విద్యా విధానంలో సైన్స్ ఆర్ట్స్ మరియు కామర్స్ విద్యార్థుల మేజర్ మరియు మైనర్ సబ్జెక్టుల గురించి అలాగే నూతన విద్యా విధానంలో భాగంగా భారతీయ విద్య, చరిత్రకు, సంస్కృతము, కళలకు, యోగ వంటి అంశాలకు పెద్దపీట వేశారని, సంస్కృత భాషకు ప్రాధాన్యం ప్రస్తుత సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మారిన విద్యా విధానం ఉంటుందని వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జువాలజీ అధ్యాపకులు డాక్టర్ సురేష్ గారిని కళాశాల చైర్మన్ అభినందించడం జరిగింది.కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి చరిత్రకు మారిన విద్యా విధానంలో ప్రాధాన్యం ఉంటుందని ఆర్యభట్ట చరకుడు శివాజీ వీరి జీవిత చరిత్రలు ఆచరణ యోగ్యమైనవిని క్రీస్తు శకము ఆరో శతాబ్దంలోనే నలంద తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలలో విదేశీయులు కూడా సంస్కృతము వ్యాకరణము నీతి శాస్త్రము చరిత్ర వంటి అంశాలు చదివారని కొన్ని వేల మంది విద్యార్థులు ఇక్కడ మన గ్రంథాలను మన సంస్కృత భాషను అధ్యయనం చేశారని ఖగోళ శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివారని చెప్పారు. పాశ్చాతులు మన దేశానికి రాకపూర్వమే మన దేశంలో గొప్ప గురుకుల విద్యా విధానము క్రమశిక్షణతో కూడిన విద్య అమలులో ఉండేదని అయితే నేడు అవన్నీ మరుగున పడిపోయాయని నూతన విద్యా విధానం వలన వాటిని తిరిగి విద్యార్థులు చదవడం వలన నిజమైన చరిత్ర చదివిన వారు అవుతారని యువతలో నైపుణ్యము నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయనీ పెరుగుతున్న సైన్స్ సాంకేతిక పరిజ్ఞానం కూడా మారిన విద్యా విధానంలో ఉంటుందని వివరించారు.

విద్యార్థులకు అవగాహన కలిగించే ముందు అధ్యాపకులు క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని ఈ వర్క్ షాప్ ను నిర్వహించామని రామకృష్ణారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీ సుబ్బయ్య పీజీ మరియు డిగ్రీ అధ్యాపకులు పాల్గొన్నారు.