జాతీయం ముఖ్యాంశాలు

మరోసారి పెట్రోల్‌ ధరల పెంపు.. హైదరాబాద్‌లో ఎంత పెరిగిందంటే?

దేశంలో ఇంధన ధరల పెంపు కొనసాగుతున్నది. శనివారం లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 37 పైసలు పెంచాయి. తాజాగా పెంచిన ధరలతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.98.11కు చేరగా.. డీజిల్‌ రూ.88.65కు పెరిగింది. మే 4వ తేదీ తర్వాత ఇంధన ధరలు పెరగడం ఇది 31వ సారి. ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ.7.79, డీజిల్‌పై 7.87 వరకు చమరు కంపెనీలు పెంచాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.104 దాటింది. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.10.22కు పెరగ్గా.. డీజిల్‌ రూ.96.16కు చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.102కు చేరువైంది. ప్రస్తుతం ధర రూ.101.96కు పెరిగింది.

మరో వైపు అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో 109.30 చేరగా.. డీజిల్‌ రూ.101.85కు చేరింది. ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలకు డిమాండ్‌ పెరగ్గా.. మూడేళ్ల గరిష్ఠానికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో శుక్రవారం బ్రెంట్‌ ముడి ధర బ్యారెల్‌కు 76 డాలర్లు దాటింది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి బ్రెంట్‌ 0.62 డాలర్లు పెరిగి.. యూఎస్‌ మార్కెట్‌లో బ్యారెల్‌కు 76.18 డాలర్లకు చేరింది. యూఎస్‌ వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ 0.75 డాలర్లు పెరిగి.. బ్యారెల్‌కు 74.05 డాలర్లు పలికింది.

దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్‌ ధరలు
ఢిల్లీలో పెట్రోల్‌ రూ.98.11.. డీజిల్‌ రూ.88.65
ముంబైలో పెట్రోల్‌ రూ.104.22.. డీజిల్‌ రూ.96.16
హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.101.96.. డీజిల్‌ రూ.96.63
చెన్నైలో పెట్రోల్‌ రూ.99.18.. డీజిల్‌ రూ.93.22
కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.97.99, డీజిల్‌ రూ.91.49
విజయవాడలో పెట్రోల్‌ రూ.104.31, డీజిల్‌ రూ.98.38
భోపాల్‌లో పెట్రోల్‌ రూ.106.35.. డీజిల్‌ రూ.97.37
బెంగళూరులో పెట్రోల్‌ రూ.101.39, డీజిల్‌ రూ.93.98
పాట్నాలో పెట్రోల్‌ రూ.100.13.. డీజిల్‌ రూ.94
చండీగఢ్‌లో పెట్రోల్‌ రూ.94.35, డీజిల్‌ రూ.88.29
లక్నోలో పెట్రోల్‌ రూ.95.29, డీజిల్‌ రూ.89.06
రాంచీలో పెట్రోల్‌ రూ.93.82, డీజిల్‌ రూ.93.57