జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ రక్షణ అధికారంలోకి వచ్చాక భక్షణ ఇది జగన్ తీరు అని మాజీ మంత్రి, ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు. జగన్ రెడ్డి విశాఖపట్నంలో దురాగతాలను ఎండగడుతూ విశాఖ ప్రజలను మోసం చేసిన జగన్ రెడ్డి కి వ్యతిరేకంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అధ్య క్షులు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర భారీ నిరసన కార్యక్రమం జరిగిం ది.
కార్యక్రమానికి వచ్చిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లా డుతూ వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడే సేవ్ విశాఖ పేరుతో జగన్ భారీ మీటింగ్ పెట్టాడు ప్రజలందరూ నిజమ ని నమ్మి జగన్ ని గెలిపించారు వైసీపీ అధికారంలోకి వచ్చిన విలువైన అన్ని భూములను దోచేశారు అని అన్నారు. నాలుగు దిక్కులా ఉన్న వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కొట్టేశారు అని ఆరోపించారు. జగన్ విశాఖకు రావడం శుభవార్త కాదు ప్రజలకు చేదువార్త అని అన్నారు. జగన్ విశాఖ రాకుండానే జాలు ప్రపోస్ ప్రభుత్వ ఆస్తులు తనకా వంటి దురా గతాలు జరుగుతుంటే అతనొస్తే ఇంకా అనర్ధాలు జరుగుతాయొ అని అన్నా రు. సూర్యుడు ఉదయించడం ఎంత వాస్తవమో చంద్రబాబు మళ్ళీ అధికా రంలోకి రావడం ఖాయం అని చెప్పారు.