సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరిలో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై రాజమహేంద్రవరంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం నిర్మాణంపై జగన్ చేతులెత్తేశాడు. ఒక మూర్ఖుడు అధికారంలో ఉంటే ఎంతనష్టం జరుగుతుందో చెప్పడానికి పోలవరమే పెద్ద కేస్ స్టడీ. ప్రాజెక్టుల నిర్వహణకు డబ్లుల్లేవన్న ముఖ్యమంత్రి…పెద్దిరెడ్డి కి రూ.8వేలకోట్ల టెండర్లు ఎలా కట్టబెట్టాడని ప్రశ్నించారు.
దేశానికి అన్నంపెట్టిన ప్రాంతం గోదావరి డెల్టా. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా కాటన్ విగ్రహాలు కనిపిస్తుంటాయి. ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణంతో ఆయన ఇక్కడి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాడు. మంచిపని చేస్తే ప్రజ లు అభిమానిస్తారు అనడానికి ఇదే నిదర్శనం.
పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఈ జిల్లాలో ప్రతిఎకరాకు నీరు అందుతుంది. అలానే పరిశ్రమలకు నీటిసమస్య ఉండదు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వం సంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా ప్రతిపక్షంలో ఉన్న మేం, మాకు న్న వనరులతో సేకరించిన సమాచారంతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నమే ఈ కార్యక్రమమని అన్నారు. టీడీపీ హాయాంలో పోలవరం నిర్మాణం వేగంగా జరిగింది. దేశంలో మరే జాతీయప్రాజెక్టులో జరగనంత వేగంగా పనులు జరిగేలా చూశాం. నదీప్రవాహాన్ని దారిమళ్లించి పనులు చేశాం. మా హాయాంలో 24 గంటల్లో 32,315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గిన్నిస్ రికార్డు సాధించాం. పోలవరం నిర్మాణానికి టీడీపీ హాయాంలో రూ.11,537కోట్లు ఖర్చుపెట్టి, 72శాతం పూర్తిచే శాం. జరిగిన పనుల్ని చూసి కేంద్రమంత్రులు అభినందించారు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.4,611కోట్లు ఖర్చుపెట్టింది. అది కూడా మాహా యాంలో జరిగిన పనులకు కేంద్రప్రభుత్వమిచ్చిన సొమ్ము.
దాన్ని సక్రమంగా నిర్మాణానికి వినియోగించకుండా కేవలం కాంట్రాక్ట్ సంస్థలకు దోచిపె ట్టారని ఆరోపించారు. పోలవరం నిర్మాణంపై జగన్ రెడ్డి చేతులెత్తేశాడు. నిన్నకూడా జగన్ రెడ్డి 41.15 మీటర్ల ఎత్తులోనే ప్రాజెక్ట్ నిర్మాణమంటున్నాడు. ప్రాజెక్ట్ నిర్మించలేనని చేతులెత్తేశాడని అన్నారు.