ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

Covid-19 | ఏపీలో కొత్తగా 1,321 మంది కరోనా

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,321 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం 20,10,566కు పెరిగాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 19,81,906 మంది కోలుకున్నారు. 24 గంటల్లో కరోనాతో 19 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 13,807కు చేరింది. ప్రస్తుతం ఏపీలో 14,853 యాక్టివ్‌ కేసులున్నాయి. 24 గంటల్లో 64,461 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 225 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. తూర్పు గోదావరిలో 218, కృష్ణా జిల్లాలో 153, పశ్చిమ గోదావరిలో 142, నెల్లూరులో 139, గుంటూరులో 128, ప్రకాశంలో 118 మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షలు చేశారు.