ap elec
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ఇవాళ్టి నుంచి ఉద్యోగుల సమ్మె

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. ఈనెల 9వ తేదీన పెన్ డైన్, సెల్ ఫోన్ డౌన్ చేయాలని విద్యుత్ ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ట్రాన్స్ కో, జెన్ కో, డిస్కంల ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. జులై నెలాఖరు నుంచి విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్ీలతో విధులకు హాజరవుతున్న విషయం తెలిసిందే. 9వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతుండగా.. 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఉద్యోగులు హెచ్చరించారు. ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో విద్యుత్ సౌధ పరిసరాల్లో పోలీసుల బందోబస్తును విజయవాడ నగర డీసీపీ విశాల్ గున్నీ పరిశీలించారు. ఉద్యోగుల ముసుగులో అసాంఘీక శక్తులు నగరంలోకి చొరబడి అలజడి సృష్టించే అవకాశం ఉన్నందున మందుస్తు చర్యల్లో బాగంగానే గస్తీ ఏర్పాటు చేశామని డీసీపీ వెల్లడించారు.

దశలవారీగా రిలే నిరాహార దీక్షలు చేయడానికి ఏపీ విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస నేతలు గత నెలలోనే పిలుపునిచ్చారు. ముందుగా జులై 27వ తేదీన భోజన విరామంలో నల్ల బ్యాడ్జీలతో విద్యుత్ ఉద్యోగులు నిరసనను ప్రారంభించారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించటంలో జగన్ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని జులై 27వ తేదీ నుంచి విద్యుత్ సిబ్బంది నిరసనకు సిద్ధమయ్యారు. సమ్మె, ఆందోళనల నోటీసును విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యచరణ సమితి ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కోల ఎండీలకు, డిస్కంల సీఎండీలకు అందజేశారు. తొలి దశలో జులై 27 తేదీ నుంచి మొదలు పెట్టననున్న నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు ఆగస్టు 9 తేదీ వరకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమయంలో తమ సమస్యలు పరిష్కరిస్తే నిరవధిక సమ్మెను విరమించుకుంటానమి చెప్పారు.

ఆ ఆందోళనలు, నిరసనలలో రాష్ట్రంలోని అన్ని విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, డివిజన్‌, జోనల్‌, ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల కార్పొరేట్‌ ఆఫీసులలో సేవలు అందిస్తున్న సిబ్బంది పాల్గొననున్నారు. లేనిపక్షంలో ఆగస్టు 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు స్పష్టం చేశారు. ఆగస్టు 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టి తమ సమస్యలు పరిష్కరించుకుంటామని అన్నారు. గతంలో పలుమార్లు చర్చలు జరిపినా యాజమాన్యాలు తమ సమస్యలకు పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో సమ్మెకు దిగడం తప్ప మరోక మార్గం లేదని భావించి గురువారం నోటీసులు ఇచ్చారు. తమ సమ్మెతో సమస్యలు వస్తాయని, పరిశ్రమలు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని కనుక చర్చల ద్వారా పరిష్కరించడం సరైన విధానమని విద్యుత్ ఉద్యోగుల ఐకాస చెబుతోంది.