thatiparti shoba
తెలంగాణ రాజకీయం

మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా శోభారాణి నియామకం

మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా తాటిపర్తి శోభారాణి ని నియామకం చేసినట్లు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీత రావు తెలిపారు.
మహిళా కాంగ్రెస్ పార్టీ పటిష్ఠతకు పాటుపడాలని శోభారాణి కి ఆమే సూచించారు.
ఈ మేరకు సునీత రావు ఉత్తర్వులు జారీ చేశారు.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికేపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ తాటిపర్తి శోభారాణి కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పాల్గొంటు పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తున్న నేపథ్యంలో ఆమెను ఈ పదవిలో నియమించినట్లు సునీతరావు తెలిపారు.
శోభారాణి 1995 లో పెగడపల్లి జెడ్పిటిసి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందారు.
2019 లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బతికేపల్లి సర్పంచ్ గా శోభారాణి గెలుపొందారు.
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లో శోభారాణి చురుకుగా పాల్గొంటు జగిత్యాల జిల్లాలో పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్న క్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించారు.
ఈ సందర్బంగా శోభారాణి మాట్లాడుతూ నాపై నమ్మకంతో అప్పజెప్పిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని అలాగే మహిళా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
శోభారాణి నియామకం పట్ల పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్, మహిళా, యూత్ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.