lost phones
తెలంగాణ ముఖ్యాంశాలు

తెలంగాణలో ఫోన్ల రికవరీ 69 శాతం

ఏదైనా స్మార్ట్‌ఫోన్‌ పోగొట్టుకున్నా.. ఎవరైనా దొంగిలించిన అది దొరుకుతుందన్న నమ్మకం ఏ మాత్రం ఉండదు. ఎందుకంటే దానిని ఎవరు దొంగిలించారనేది తెలుసుకోవడం కష్టంగా ఉండేది. ఇంటర్ననెట్‌లో ఎంత ట్రేస్‌ చేసినా దొంగలు వాటిని బ్లాక్‌ చేడయమే, స్విఛాఫ్‌ చేయడమే, లేక సిమ్‌ కార్డ్‌ను తొలగించడమే చేస్తుంటారు. దీంతో పోయిన స్మార్ట్‌ ఫోన్‌ దొరుకుతుందన్న నమ్మకం బాధితుల్లో ఉండేది కాదు. అందుకే పొరపాటున పోగొట్టుకున్నా.. లేక దొంగతనానికి గురైనా చేతులు ముడుచుకుని ఉండటం తప్ప చేసేది ఏమి లేదని చాలా మంది సైలెంట్‌గా ఉండిపోతున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. దొంగతనానికి గురైనా, పోగొట్టుకున్నా సులభంగా రికవరీ చేసే టెక్నాలజీ వచ్చింది. ఇందుకు తెలంగాణ పోలీసు శాఖ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఎంతటి ఫోన్‌ అయినా సులభంగా రివకరీ చేస్తున్నారు.సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న, దొంగిలించిన మొబైల్ ఫోన్‌ల రికవరీలో అగ్రస్థానంలో నిలిచేందుకు తెలంగాణ అన్ని రాష్ట్రాలను అధిగమించింది. రికవరీలో 67.9% రేటును సాధించింది. డేటా ప్రకారం.. తెలంగాణ పోలీసులు కేవలం 110 రోజుల్లో 5,038 పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన మొబైల్ పరికరాలను తిరిగి రికవరీ చేశారు. గత 1,000 ఫోన్‌లను కేవలం 16 రోజుల్లో తిరిగి రికవరీ చేయగలిగారు తెలంగాణ పోలీసులు. అయితే తెలంగాణ ఆగ్రస్థానంలో ఉంటే ఆ తర్వాత కర్ణాటక 54.2 శాతం, ఆంధ్రప్రదేశ్ 50.9 శాతంతో రెండో స్థానంలో నిలిచాయి. ఈ ఏడాది మే 17న అధికారికంగా దేశవ్యాప్తంగా ప్రారంభించిన పోర్టల్ ఏప్రిల్ 19 నుంచి తెలంగాణలో ప్రయోగాత్మకంగా ప్రారంభించబడింది.

ఏప్రిల్ 20, ఆగస్టు 7 మధ్య కాలానికి సంబంధించిన CEIR పోర్టల్ డేటాలో తెలంగాణ విజయం సాధించింది. ఇందులో మొత్తం 55,219 ఫోన్‌లు బ్లాక్ చేయగా, 11,297 ట్రేస్‌బిలిటీ నివేదికలు అందాయి. 5,038 ఫోన్‌లు అన్‌బ్లాక్ చేశారు. ఈ ఫోన్‌ల రికవరీ తర్వాత ఆ ఫోన్‌లు ఎవరివైతే ఉన్నాయో వారికి అందజేశారు పోలీసులు. ట్రై కమిషనరేట్‌లలో సైబరాబాద్‌ 763 మొబైల్‌ పరికరాలను అందించగా, హైదరాబాద్‌ కమిషనరేట్‌లో 402, రాచకొండ కమిషనరేట్‌లో 398 మొబైల్‌ పరికరాలు ఉన్నాయి. వాటి తర్వాత వరంగల్, నిజామాబాద్ కమిషనరేట్లు ఉన్నాయి.వినియోగదారుల సౌకర్యాన్ని మెరుగుపరిచే ప్రయత్నంలో తెలంగాణ పోలీసులు CEIR పోర్టల్‌ను సిటిజన్ పోర్టల్‌తో అనుసంధానించడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగంతో సహకరించారు.

రాష్ట్రంలోని వ్యక్తులు దొంగతనానికి గురైనా, పోగొట్టుకున్న మొబైల్ పరికరాలను నివేదించడానికి MeeSeva లేదా పోలీస్ స్టేషన్‌లను సందర్శించాల్సిన అవసరాన్ని నివారించి, వినియోగదారు-స్నేహపూర్వక సేవను ఉపయోగించుకునేలా ప్రోత్సహించింది. ‘తెలంగాణ పోలీసులు ప్రజా భద్రత గౌరవానికి కట్టుబడి ఉన్నారు. దొంగిలించబడిన సెల్‌ఫోన్ రికవరీలో ఈ అగ్రస్థానం మా సంకల్పానికి నిదర్శనం’ అని తెలంగాణ పోలీసు డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ అన్నారు.