నియోజకవర్గంలో కొనసాగుతున్న’ఈటల’ పాదయాత్ర
”ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి సాక్షిగా చెబుతున్నా” ఈటల గెలుస్తున్నారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ గెలిచిన తరువాత ఇక్కడ దర్శనం చేసుకొని నేరుగా అయోధ్య రాముడిని దర్శించుకుంటానని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ పాదయాత్ర ఆరవ రోజు కొనసాగుతోంది. ర్యాలీలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కెసిఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతి సర్వేలో ఈటల గెలుస్తున్నారని చెప్పడంతో భయానికి సీఎం కేసీఆర్ తెల్లవారు జామున నిద్రపోతున్నారని పేర్కొన్నారు. హుజురాబాద్ లో త్వరలో జరిగే ఉప ఎన్నికలకు టిఆర్ఎస్ పార్టీ కి అభ్యర్థి కరువయ్యారు అని ఎద్దేవా చేశారు.