havai island
అంతర్జాతీయం

హ‌వాయి ద్వీపంలో ల‌హైనా ప‌ట్ట‌ణాన్ని రాత్రికి రాత్రే బుగ్గి చేసేసింది కార్చిచ్చు మ‌ర్రి చెట్టు మాత్రం స్వ‌ల్పంగా కాలిపోయి స‌జీవంగా ఉన్న మ‌ర్రి చెట్టు 1873లో ప్రొటెస్టాంట్ మిష‌న్ వార్సికోత్స‌వం సంద‌ర్భంగా ఇండియా గిఫ్ట్‌

అమెరికాలోని హ‌వాయి ద్వీపంలో వ‌చ్చిన కార్చిచ్చు రాత్రికి రాత్రే ల‌హైనా ప‌ట్ట‌ణాన్ని బుగ్గి చేసేసింది. ఆ దావాన‌లం ధాటికి ఆ ప‌ట్ట‌ణంలో ఉన్న బిల్డింగ్‌ల‌న్నీ కాలిపోయాయి. మ‌హా వృక్షాలు కూడా ద‌గ్ధం అయ్యాయి. అయితే ల‌హైనా కోర్ట్‌హౌజ్ ముందు నాటిని మ‌ర్రి చెట్టు మాత్రం స్వ‌ల్పంగా కాలిపోయింది. ఆ మ‌ర్రి చెట్టు ఊడ‌లు కొన్ని ఇంకా స‌జీవంగా ఉన్నాయి.ఈ మ‌ర్రి వృక్షానికి పెద్ద స్టోరీ ఉంది. 1873లో ఇండియా నుంచి ఈ మ‌ర్రి వృక్షానికి చెందిన మొక్క‌ను తీసుకువెళ్లి అక్క‌డ నాటారు. 150 ఏళ్లుగా ఆ చెట్టు త‌న శాఖ‌ల‌ను విస్త‌రిస్తూ పోయింది. ల‌హైనా హార్బ‌ర్ స‌మీపంలో ఆ వృక్షం ఓ సుంద‌ర ప్ర‌దేశంగా మారింది. స్థానిక ప‌ర్యాట‌కుల్ని ఆ వృక్షం ఆక‌ర్షిస్తోంది.అయితే ఆగ‌స్టు 10వ తేదీన ఆకస్మికంగా దాడి చేసిన దావాన‌లంలో ఆ బోధి వృక్షం స్వ‌ల్పంగా కాలిపోయింది.

యావ‌త్ అమెరికాలోనే ఈ మ‌ర్రి వృక్షం పెద్ద‌ద‌న్న వాద‌న కూడా ఉంది. శాటిలైట్ ఇమేజ్‌లో ఆ వృక్షం పూర్తిగా కాలిపోయిన‌ట్లు అనిపిస్తోంది. కానీ ఆ వృక్షంలో జీవం ఉన్న‌ట్లు కొన్ని వీడియోలు రిలీజ్ అయ్యాయి.హ‌వాయి టూరిజం శాఖ ప్ర‌కారం ఈ మ‌ర్రి వృక్షం సిటీ బ్లాక్ మొత్తం విస్త‌రించి ఉంటుంద‌ని తెలుస్తోంది. ఆ వృక్షం దాదాపు 60 ఫీట్ల ఎత్తు వ‌ర‌కు ఉంటుంద‌ని హ‌వాయి టూరిజం శాఖ తెలిపింది. ఈ చెట్టు కిందే స్థానిక ప్ర‌జ‌లు ఎన్నో సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేవారు.1873లో ఈ వృక్షాన్ని నాటిన స‌మ‌యంలో అది కేవ‌లం రెండు మీట‌ర్ల ఎత్తులో మాత్రమే ఉంది. ల‌హైనాలో ప్రొటెస్టాంట్ మిష‌న్ వార్సికోత్స‌వం సంద‌ర్భంగా ఆ మ‌ర్రి మొక్క‌ను ఇండియా గిఫ్ట్‌గా ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. హ‌వాయి దీవులు అమెరికాలో చేర‌డానికి 25 ఏళ్ల ముందే ఈ వృక్షాన్ని నాటారు. తాజా దావాన‌లంలో ఆ చెట్టు ఆకులు, చిన్న చిన్న కొమ్మ‌లు కాలిపోయాయి. కానీ ఆ మ‌హావృక్షానికి చెందిన కాండాలు మాత్రం కాలిపోలేదు.

ఆ చెట్టు వేళ్ల‌కు కూడా ఏమీకాలేదు. అంటే ఆ వృక్షంలో జీవం ఉంద‌ని, మ‌ళ్లీ ల‌హైనా ప‌ట్ట‌ణం జీవం పోసుకుంటుంద‌ని స్థానికులు అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.ల‌హైనాలో కార్చిచ్చులో ఎలా స్టార్ట్ అయ్యిందో తెలియ‌దు. కానీ మంగ‌ళ‌వారం రాత్రి ఆ ప‌ట్ట‌ణంలో బీభీత్సం సృష్టించింది. బ‌ల‌మైన గాలుల ధాటికి ఆ ప‌ట్ట‌ణంలో ఉన్న వృక్షాల‌న్నీ ద‌గ్దం అయ్యాయి. ఇక బిల్డింగ్‌లు ధ్వంసం అయ్యాయి. కార్లు కూడా ఆ మంట‌ల్లో కాలిబూడిద‌య్యాయి. కార్ల‌లో కూర్చుకున్న కొంద‌రు ఆ వేడి త‌ట్టుకోలేక వెళ్లి స‌ముద్రంలో దూకారు. గాలిలో లేచి వ‌స్తున్న అగ్ని కీల‌ల వ‌ల్ల కూడా ప్ర‌జ‌లు ఇబ్బందులు పడ్డారు. తెల్ల‌వారేలోగా ఆ ప‌ట్ట‌ణం ఓ మ‌రుభూమిలా మారింది. తాజా స‌మాచారం ప్ర‌కారం హ‌వాయి ద్వీప అగ్ని ప్ర‌మాదంలో మృతిచెందిన వారి సంఖ్య 53కి చేరింది.