టెక్నాలజీ తెలంగాణ

ఇంటింటా ఇన్నోవేటర్ లో పెద్దపల్లి జిల్లా వాసులు అద్బుత ప్రదర్శన రాష్ట్ర స్థాయిలో ఎంపికైన నాలుగు ఆవిష్కరణలు విద్యార్థులకు కలెక్టర్ ప్రత్యేక అభినందనలు

ఇంటింటా ఇన్నోవేటర్ ప్రదర్శనలో భాగంగా పెద్దపల్లి జిల్లా వాసులు మరోమారు అద్బుత ప్రదర్శన కనబరిచారు.టి.ఎస్.ఐ.సి నిర్వహిస్తున్న వినూత్న ఆవిష్కర ణలు ఇంటింటా ఇన్నోవేటర్ ప్రదర్శనలో ఈ
సంవత్సరం జిల్లాకు చెందిన ఒక విద్యార్థి, యువ టెక్నోక్రాట్ ప్రదర్శనతో పాటుగా మరో రెండు  ఎగ్జిబిట్స్ ఉత్తమంగా నిలిచి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా నిర్వహించే ప్రదర్శనలో ఆ ప్రాజెక్టులు
కనువిందు చేయించారు. మొత్తంగా రాష్ట్ర స్థాయి ఎంపికలో  జిల్లా నుండి 4 బహుమతులు గెలుచుకోగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అభినందించారు. జిల్లాలోని రామగిరి మండలం వాణి ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి టి.విక్రం రూపొందిం చిన “రైతు కాంతి”వ్యవసాయదారులకు ఇతోధికం గా ఉపయోగపడుతుందని,  గోదావరిఖ నికి చెందిన యువ టెక్నోక్రాట్ బి.భగత్ ప్రశాంత్ తన
ఉత్తమ ప్రదర్శనల ద్వారా ఇప్పటికే నాలుగు మార్లు సత్తా చాటగా  ఈ మారు కూడా తాను రూపొందించిన కలుపు పరికరం ఎంపిక కావడం విశేషం.

అలాగే అంతర్గాం మండలంకు చెందిన పల్లె రాజు ఈ సారి పౌల్ట్రీ రైతులకు ఉపయుక్త మైన “కోడి గ్రుడ్ల పొదుగుడు” సాధనంను వినూత్న రీతిలో రూపొందించి విజేతగా నిలిచారు. జిల్లాకు చెందిన మంథని యువ ఇంజనీర్ మూల శశిరత్ రెడ్డి తన మదిలో మెరిసిన ఆలోచనతో డీజిల్ స్థానంలో బ్యాటరీతో నడిచే   “ఎలక్ట్రానిక్ ట్రాక్టర్” ను రూపొందించి ఈ ప్రదర్శనకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. అలాగే 4 విభాగాలలో బహుమ తులు గెలుపొంది ఉమ్మడి జిల్లా పరంగా జిల్లా వాసులు శభాష్ అనిపించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని విద్యార్థులు, ఇతర ఆవిష్కర్తలకు కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. జిల్లా పేరును జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు.