mlc chandrasekhar
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ఇచ్చిన మాట నేరవేర్చే సీఎం జగన్ మోహన్ రెడ్డి

నా జీవితంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి లాంటి  ముఖ్యమంత్రిని చూడలేదనీ రాయలసీమ  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మాట ఇచ్చాడు అంటే కచ్చితంగా నెరవేర్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కొనియాడారు. 2014 వ సంవత్సరానికి ముందు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగస్తులను..అధ్యాపకులను అందరిని పర్మినెంట్ చేయడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.తన జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదని అన్నార. 23 సంవత్సరాల నిరుద్యోగస్తుల కలను నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు.దాదాపు 11 వేల మంది జీవితాల్లో వెలుగు నింపాడు అన్నారు. కాంట్రాక్టు అధ్యాపకులకు.. ఉద్యోగులకు అందరికీ చల్లని కబురు చెప్పారని పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 2014 సంవత్సరానికి ముందు ఉన్న కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లిన వెంటనే క్షణాల్లో ఆమోదించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 25 సంవత్సరాల నుండి 6000 మంది డిఎస్సీ అభ్యర్థులు ఉద్యోగుల కోసం తిరుగుతున్నారని వారి కల కూడా నెరవేర్చిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు.

ఈ మధ్యకాలంలో ఆరు మంది ముఖ్యమంత్రులు మారారని ఎవరు చేయని సాహసపెతమైన చర్యలు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడని కొనియాడారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కావడంతో 50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. 11 వేల మంది వైద్య రంగంలోని వారినీ పర్మినెంట్ మరో పదకొండు వేల మంది స్కూల్ అసిస్టెంట్ గా తీసుకోవడం జరిగిందన్నారు. 660 మంది ఎంఈఓ పోస్టు రావటం ఎంతో ఆనందంగా ఉందన్నారు.పూర్తిస్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు.గతంలో గవర్నమెంట్ స్కూల్స్ లో మహిళలు బాత్రూం కి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడే వారిని ఆ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. 65 వేల కోట్లు రూపాయలను చదువుకు ఖర్చు చేయటం ఆనందంగా ఉందన్నారు.జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో నేను ఎమ్మెల్సీ గా పనిచేయటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.గతంలో ఏపీలో 3.10.000 మంది ఉద్యోగస్తులు ఉండేవారని ఒకేరోజు లక్ష 30 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు.


13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చి పాలన వ్యవస్థ చక్కగా మార్చినట్లు తెలిపారు. నా జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రినీ చూడలేదని పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రజల మనిషి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో తాను ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విధులు నిర్వహిస్తున్నందుకు ఎంతగానో గర్వపడుతున్నట్లు ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆరు సంవత్సరాలు ఉపాధ్యాయ.. అధ్యాపకుల సమస్యలు తీర్చడానికి తన వంతు కృషి చేస్తానని పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.అనంతరం వైఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి ప్రభుత్వ అధ్యాపకుల.. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల సమస్యలు తీర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో ప్రభుత్వ అధ్యాపకులు.. కాంట్రాక్టు ఉద్యోగస్తులు పాల్గొన్నారు.