- క్షల కుటుంబాలకు లబ్ధి
- ఏటా కొంతమంది లబ్ధిదారుల ఎంపిక
- ఈ ఏడాది రూ.1000 కోట్ల వ్యయం
- సబ్‌ప్లాన్‌తో ఈ స్కీంకు సంబంధం లేదు
- కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్
శరీరంలో ఒక భాగం పాడైతే.. ఆ శరీరానికి ఎంత బాధ ఉంటుందో, సమాజం లో ఒక వర్గం వివక్షకు గురైతే.. సమాజానికి కూడా అంతే బాధగా ఉంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మనలోనే భాగమై జీవిస్తున్న మనుషులను దళితుల పేరుతో బాధ పెట్టే వ్యవహారం మంచిది కాదని అన్నారు. ప్రగతిభవన్‌లో శనివారం కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ‘సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీం’ గురించి మాట్లాడారు. దళిత సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నదని, ఆదివారం ఉదయం 11.30 గంటలకు జరిగే అఖిలపక్ష సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో కలెక్టర్లు, ఉన్నతాధికారుల పాత్ర కీలకమని అన్నారు. ఈ పథకంలో భాగంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న దాదాపు ఎనిమిది లక్షల దళిత కుటుంబాలను దశలవారీగా అభివృద్ధి పరచడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని తెలిపారు. ఇందుకుగాను రూ.1,000 కోట్లు ఈ ఏడాది ఖర్చు చేయబోతున్నామని సీఎం ప్రకటించారు.
సబ్‌ప్లాన్‌తో సంబంధం లేదు
దళిత సాధికారత పథకానికి, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు సం బంధం లేదని, దీనికి ప్రత్యేకంగానే నిధులు ఖర్చు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. దళితుల్లో వెనుకబాటుతనాన్ని, బాధలను తొలిగించే క్రమంలో కలెక్టర్లు, ఉన్నతాధికారుల పాత్ర కీలకం కాబోతున్నదన్నారు. పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయాలని ఆదేశించారు. ప్రతి ఏటా కొందరు లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేసి, పారదర్శకంగా దళితుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బు జమయ్యేటట్లుగా చూడాల్సి ఉంటుందని చెప్పారు.