dammaiguda
తెలంగాణ

దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు మరియు 16వ వార్డు లోCC రోడ్డు మరియు మురికి కాలువ నిర్మాణం అభివృద్ధి పనులు

దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు మరియు 16వ వార్డు లో చైర్ పర్సన్ శ్రీమతి వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ గారి చే 6 లక్షల రూపాయల వ్యయం తో CC రోడ్డు మరియు 8లక్షల అరవై వేల తో భూగర్భ మురికి కాలువ నిర్మాణం అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ S.రాజమల్లయ్య, వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి ,స్థానిక వార్డు కౌన్సిలర్ మాదిరెడ్డి పావనిరెడ్డి,బి, ఆర్, ఎస్. పార్టీ నాయకులు సంపన్ బోల్ హరి గౌడ్, మోర నరహరి రెడ్డి, ఖాజామీయ కాలనీ ప్రెసిడెంట్ మరియు కాలనీ వాసులు పాల్గొనడం జరిగింది.