kcr
తెలంగాణ రాజకీయం

కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్.. వారి రిటైర్మెంట్ వ‌య‌సు పెంపు

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ శుభవార్తల మీద శుభవార్తలు వినిపిస్తూనే ఉంది. తాగా.. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ వయసును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాందండోయ్.. రిటైర్మెంట్ తర్వాత కూడా బెన్‌ఫిట్లు అందేలా కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కేసీఆర్ సర్కారు మరో శుభవార్త వినిపించింది. రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును పెంచింది. ప్రస్తుతం రిటైర్మెంట్ వయస్సు 61 సంవత్సరాలుగా ఉండగా.. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం దాన్ని 65 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఉద్యోగ విర‌మ‌ణ చేసే అంగ‌న్‌వాడీ టీచర్లకు ల‌క్ష రూపాయలు, మినీ అంగ‌న్‌వాడీ టీచ‌ర్లతో పాటు హెల్పర్లకు 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందించ‌నుంది. టీచ‌ర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ తర్వా.. వాళ్లకు ఆస‌రా పింఛన్లు కూడా మంజూరు చేయ‌నుంది తెలంగాణ సర్కారు.

అయితే.. రాష్ట్రంలో ఉన్న పలు మినీ అంగ‌న్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు.. రాష్ట్రంలోని 3,989 మినీ అంగ‌న్‌వాడీల‌ను ప్రధాన అంగ‌న్‌వాడీ కేంద్రాలుగా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స‌త్యవ‌తి రాథోడ్ కృత‌జ్ఞత‌లు తెలిపారు. కేసీఆర్ సర్కార్ ప్రతీ ఒక్కరికి మేలు చేసేందుకు కృషి చేస్తుందనటానికి ఇదే నిదర్శనమి మంత్రి చెప్పుకొచ్చారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోని అంగన్‌వాడీ టీచర్లకు అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్‌ మాత్రమేనని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత 3 సార్లు అంగ‌న్‌వాడీల వేత‌నాలు పెంచినట్టు మంత్రి సత్యవతి రాథోడ్ గుర్తు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్‌వాడీ టీచర్లకు రూ.7,800, హెల్పర్లకు రూ.7,800 చొప్పున వేతనాలు ఇస్తున్నామన్నారు.