తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో తెలియట్లేదు గానీ..అయన చేస్తోన్న ప్రకటనలు క్యాడర్‌ను మాత్రం తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తోందనేది వాస్తవం. దీనికి నిదర్శనం- పుంగనూరు ఉదంతమే.
పుంగనూరులో అల్లర్లు చోటు చేసుకుని రోజులు గడుస్తున్నప్పటికీ అల్లర్లకు పాల్పడిన టీడీపీ కార్యకర్తలు కేసులకు భయపడి.. ఇంకా అజ్ఞాతంలోనే ఉంటోన్నారు. వారి కోసం జిల్లా పోలీసు యంత్రాంగం అన్వేషిస్తూనే ఉంది. ఈ అల్లర్లను వైసీపీకి పులమడానికి టీడీపీ చేసిన ప్రయత్నాలు, కుట్రలేవీ ఫలించలేదు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కనపడిన వారిని కనపడినట్టే అరెస్ట్ చేస్తోన్నారు పోలీసులు.
వైఎస్సాఆర్సీపీ నాయకులతో గొడవ పడండి.. మీ మీద ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే మీకు పార్టీలో అంత ప్రాధాన్యం ఉంటుంది. అంత మంచి నామినేటెడ్ పదవి ఇచ్చే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు.. అంటూ నారా లోకేష్ చేసిన ప్రకటన రాజకీయ విశ్లేషకులు, విమర్శకుల్లో సైతం ఆలోచనలను రేకెత్తిస్తోంది.
క్యాడర్‌ను రెచ్చగొట్టి, హింసకు ప్రోత్సహించి వారిని కేసులపాల్జేసే రీతిలో నారా లోకేష్ మాటలు ఉంటోన్నాయని, ఇది సమాజంలో హింసకు దారి తీస్తోందని, దీనికి ఎవరు బాధ్యులు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయన ఇచ్చిన ఈ ఉచిత సలహా, హామీ ప్రభావం వల్లే మొన్న పుంగనూరులో పోలీసుల మీద దాడులకు తెగబడిన వందలాదిమంది టీడీపీ కార్యకర్తలు పలువురు పోలీసులను గాయపరిచారు. దీంతో వందలాదిమంది నాయకులమీద కేసులు బుక్ అయ్యారు. ఇప్పుడు వారంతా బెయిల్ కోసం తిరుగుతూ అజ్ఞాతంలో బతుకుతున్నారు. ఇటు వారి భార్యాబిడ్డలు ఆందోళనలో తిండి, నిద్ర లేకుండా రోదిస్తున్నారు. పోలీసులను తన్నండి, తరమండి అని రెచ్చగొట్టిన చంద్రబాబు సేఫ్.. అదేరోజు అయన హైదరాబాద్ వెళ్లిపోయారు.
లోకేష్ మాటలు, చంద్రబాబు డైలాగ్స్ చూసి రెచ్చిపోయిన కార్యకర్తలు మాత్రం ముందు వెనుకా ఆలోచించకుండా, భార్యా బిడ్డలు, కుటుంబం గురించి ఆలోచించకుండా రెచ్చిపోయి కేసుల్లో చిక్కుకుంటున్నారు. డైలాగ్స్ చెప్పి రెచ్చగొట్టడం వేరు.. దానికి పైసా ఖర్చు పెట్టనక్కర్లేదు. ఒకసారి కేసుల్లో ఇరుకున్నాక బయటపడడం అంటే ఎంత కష్టమో ఇప్పుడు వారికి అర్థం అవుతోంది.
ఫ్రస్ట్రేషన్ ఎక్కువై మాట్లాడుతున్నారో, కడుపుమంటతో అంటున్నారో తెలియట్లేదు గానీ లోకేష్ గన్నవరంలో చేసిన ప్రసంగం సైతం ఆయనలోని ఆందోళనను వెల్లడిస్తోంది. మనం అధికారంలోకి వచ్చాక ఒకొక్కడికి ఉచ్చ పోయిస్తాం… కొందర్ని చంపేద్దాం.. ఇంకొందరిని చెడ్డీలతో నడిపిద్దాం.. అంటూ నారా లోకేష్ వారిని మూర్ఖంగా రెచ్చగొడుతున్నారు.
తాము గెలిస్తే ప్రజలకు మేలు చేస్తాం, వారి జీవితాలను మెరుగు పరుస్తామంటూ సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా హామీలు ఇస్తుంటారు. ప్రజల్లో భరోసా కలిగిస్తుంటారు. నారా లోకేష్ మాత్రం దీనికి భిన్నం. పాదయాత్ర ఆసాంతం నరుకుతాం.. చంపుతాం.. పరుగెత్తిస్తాం అనే మాటలతోనే ముగుస్తోంది.
మండల స్థాయి కార్యకర్తలు ఎవరో ఇలా మాట్లాడారు అంటే అవగాహనా లోపం అనుకోవచ్చు. పార్టీకి భావి నాయకుడిగా చెప్పుకొంటోన్న లోకేష్ కూడా ఇలా కోడి బుర్రతో ఆలోచింది క్యాడర్‌ను హింసవైపు నడిపించడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం అలా అందర్నీ చంపుతాను అని చెబుతోంది అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలా చేయొచ్చని చెబుతున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతోన్నాయి. ఎప్పుడు అధికారంలోకి వస్తారో తెలియదు. అసలు వస్తారో.. రారో కూడా తెలియదు. అధికారంలోకి రావడానికి అవసరమైన వ్యూహాలు లేవు. ప్రజలను రెచ్చగొట్టడమే వ్యూహం అనుకునే దుస్థితికి నారా లోకేష్ దిగజారిపోయారనేది విశ్లేషకుల అంచనా. ఎప్పుడో అధికారంలోకి వస్తే తాము ఆలా చేస్తామని చెబుతున్నారు మరి ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్లు అలా చేయలేరా? అంటే చేయగలరు కానీ చేయరు. ఎందుకంటే- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులూ, కిందిస్థాయి కార్యకర్తలు సైతం ప్రజలను అభిమానంతో, తమ పనితీరుతో ఆకట్టుకోవాలని కోరుకుంటున్నారు తప్ప భయపెట్టి హీరోయిజం చూపాలని భావించట్లేదు. ప్రజలు మాత్రం అన్నీ గమనిస్తూ టీడీపీకి ఎక్కడ బుద్ధి చెప్పాలో.. తమకు అవకాశం వచ్చినపుడు ఓటుతో సమాధానం చెప్పాలనేది ఫిక్స్ అయ్యారు.